వావ్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని సుమ తల్లి..!

బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్ర‌త్యేకమయిన ప‌రిచ‌యమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. త‌న మాట‌ల‌ వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజ‌గా సుమ తల్లిగారి 79 ఏళ్ల వ‌య‌స్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది.

ఏ వ‌య‌స్సులో అయినా మన మనస్సు , మైండ్ ఉత్సాహంగా, శ‌క్తివంతంగా ఉండాలంటే వ్యాయాయం తప్పనిసరి. మా అమ్మ 79 ఏళ్ల వ‌య‌స్సులో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటూ, ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు. ఇందుకు ముఖ్య కార‌ణం ఆమె క్రమం తప్పకుండా ప్ర‌తి రోజు వ్యాయామం చేయ‌డం ఇంకా ఆరోగ్యకరమయిన ఆహరం తీసుకోవ‌డం. అమ్మ రోజు వ్యాయాయమం చేస్తారు.తన ముద్దు పేరు బేబి. ఈ వీడియో అందరి తల్లులకు అంకితం చేస్తున్నా అంటూ సుమ ఈ వీడియో షేర్ చేసింది.

Share post:

Popular