ఆక‌ట్టుకుంటున్న సుధీర్ `గాలోడు` ఫ‌స్ట్ లుక్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన సుడిగాలి సుధీర్‌.. కేవ‌లం క‌మెడియ‌న్‌గానే కాకుండా యాంక‌ర్‌గా కూడా బుల్లితెర‌పై స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టీవీ షోల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతున్న సుధీర్‌.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోయినా.. న‌ట‌న ప‌రంగా సుధీర్‌కు మంచి మార్కులే ప‌డ్డారు. ఇక ఈయ‌న తాజా చిత్రం గాలోడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సంసృతి బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే నేడు సుధీర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. గాలోడు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

సిగరెట్ నోట్లో పెట్టుకొని దేనిగురించో సీరియస్‌గా ఆలోచిస్తూ మాస్ లుక్‌లో సుధీర్ క‌నిపిస్తున్నారు. గాలోడు మూవీలో సుధీర్ రోల్ ఆసక్తికరంగా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Image

Share post:

Latest