ఆ స్టార్ హీరో సినిమాలో రాజ‌శేఖ‌ర్ కూతురుకు బంప‌ర్ ఆఫ‌ర్?!

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ 2 స్టేట్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ప్ర‌స్తుతం శివానీ తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే సినిమాలో న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే మొద‌టి చిత్రం ఇంకా విడుద‌ల కాక‌ముందే.. శివానీని ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో హిట్ అయిన‌ సామాజిక సందేశాత్మక ఆర్టికల్ 15 చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు.

అరుణ్‌రాజ కామరాజ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరో ఉదయనిధిస్టాలిన్ న‌టిస్తున్నారు. బోనీకపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం శివానీరాజశేఖర్ ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది.

Share post:

Latest