మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది.

- Advertisement -

అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. కానీ వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం 19 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో మరో సినిమా రానుంది. ఈ సినిమా ఓ ప్రేమకథ అని టాక్ ఉంది. ‘ఇజార్’ సినిమా కోసం వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారని, వీరిద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో క్లారిటీ రానుంది.

Share post:

Popular