రూ.2 కోట్లు ఆఫ‌ర్ చేసినా.. ససేమీరా అన్న సాయిప‌ల్ల‌వి!

ఫిదా సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన సాయి ప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను అందుకుంది. సింపుల్‌గా కనిపిస్తూనే అందరి మనసులు దోచేసే ఈ ముద్దుగుమ్మ.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

కేవ‌లం అందం, అభిన‌యంతోనే కాదు మంచి న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సాయి ప‌ల్ల‌వి..సినిమాల ఎంపిక విష‌యంలో చాలా ప‌ర్ఫెక్ట్‌గా ఉంటుంది. త‌న‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. న‌చ్చ‌ని సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసినా.. చేయ‌న‌ని తెగేసి చెబుతుంది.

ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా జ‌రిగింది. వి.వి వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని అప్రోచ్ అయ్యార‌ట మేక‌ర్స్‌. కానీ, ఆమె మాత్రం ఈ సినిమాకు నో చెప్పింద‌ట‌. దాంతో మేక‌ర్స్ రూ.2 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ సాయి ప‌ల్ల‌వి స‌సేమీరా అంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest