హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్య‌లు!

ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంద‌రో హీరోలు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులంద‌రి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జ‌న్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.

అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వ‌హించ‌గా.. అక్క‌డ కూడా ఇదే ప్ర‌శ్న ఎదురైంది. దాంతో రేణు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

ఒక వైపున కరోనా విజృంభిస్తోంది .. దాని బారినపడి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎవరి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోగా అకీరా ఎంట్రీ గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు అంటూ రేణు కాస్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Share post:

Latest