నిఖిల్ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..!

May 26, 2021 at 12:15 pm

కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామి రారా లాంటి విభిన్న సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నిఖిల్. అతడు నటిస్తున్న తాజా సినిమా “18 పేజెస్”. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్‌ డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూన్ 1న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్ట‌ర్ క్రియేటివిటీగా ఉంది. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిఖిల్.. హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. స్వామి రారా సినిమా నుండి అతడి నుండి ఎక్కువగా హిట్ సినిమాలే వస్తున్నాయి. దీంతో నిఖిల్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే నిఖిల్ తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిఖిల్ తదుపరి సినిమాల కోసం అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిఖిల్ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts