డ్యూయల్ రోల్ ప్రభాస్..?

రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‏తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

ఇక ఈ సినిమాతోపాటే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రెబల్ స్టార్ రాముడిగా కనిపించనున్నాడు. ఇక వీటితోపాటే పాన్ ఇండియా డైరెక్టర్ కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని సమాచారం. ప్రభాస్ డ్యూయల్ రోల్ లోనే నటిస్తున్నట్టుగా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం ఈ టాక్ మరింత ఎక్కువై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తోంది. ప్రభాస్ రోల్ అలానే ఉంటుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

Share post:

Popular