వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?

టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.

నితిన్ అంధాదున్ రీమేక్ తరువాత తన నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో చేయనున్నాడని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వక్కంతం వంశీ ఇటీవల నితిన్ కి వినిపించిన కథ నచ్చడంతో, వెంటనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నితిన్ నిర్యానించుకున్నాడని అంటున్నారు. వక్కంతం వంశీకి రచయితగా మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు చాలా మటుకు పెద్ద విజయాలను అందుకున్నాయి.

Share post:

Latest