ఏపీలో కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల వరుకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటుంది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతూ వస్తుంది. ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంది. కేవలం నిన్న ఒక్క రోజులోనే 23,997 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యా తగ్గించేందుకు పగటి పూట కర్ఫ్యూ అమలుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.