మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ నితిన్ `రంగ్ దే`!

యూత్ స్టార్ నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌రోసారి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే రంగ్ దే ఓటీటీ విడుద‌ల తేదీని ఖరారు చేశారు.

ఈ చిత్రాన్ని జూన్ 12న విడుద‌ల చేస్తున్న‌ట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. మీరు ఎంత‌గానో ఎదురుచూస్తోన్న రంగు రంగుల ప్రేమ ఇంద్ర‌జాలం రంగ్ దే జూన్‌ 12 నుంచి జీ 5లో మాత్ర‌మే.. అని ట్వ‌ట్ట‌ర్ ద్వారా పేర్కొంది. మ‌రి ఈ చిత్రం ఓటీటీలో ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Share post:

Latest