త‌గ్గ‌ని సాయి ప‌ల్ల‌వి జోరు..మ‌రో రేర్ ఫీట్ అందుకున్న సారంగ‌ద‌రియా!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ కమ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన సారంగదరియా సాంగ్‌ విశేష ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్‌లో సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో మ‌రోసారి మ్యాజిక్ చేసింది.

యూట్యూబ్‌ను షేక్‌ చేసిన ఈ సాంగ్ జోరు ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఈ సాంగ్ మ‌రో రేర్ ఫీట్ అందుకుంది. సారంగ‌దరియా పాట తాజాగా 200 మిలియ‌న్ వ్యూస్ మార్క్ చేరింది. తక్కువ స‌మ‌యంలో ఇన్ని మిల‌య‌న్ల వ్యూస్ రావ‌డం నిజంగా విశేష‌మే. కాగా, ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మంగ్లీ గాత్రం అందించింది.