తోట పనిలో బిజీగా ఉన్న హీరోయిన్.. !

May 27, 2021 at 3:59 pm

ప్రస్తుతం నడుస్తున్న కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినీ నటి నటులు అందరు మూవీ షూటింగ్స్ ఆగిపోవడంతో అందరు ఎక్కువగా ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. అలానే సినీ నటీ ఆశికా రంగనాథ్‌ కూడా తన ఫాంహౌస్‌లో ఉంటూ తెగ కష్ట పడుతోంది. తాజాగా ఆమె పిక్స్ నెట్టింట్లో బాగా హల్చల్ అవుతున్నాయి.

ఆశికా రంగనాథ్‌ తన కుటుంబ సభ్యులతో తోటలో పని చేస్తూ తనకు లభించిన ఈ ఖాళీ సమయాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ చాలా హ్యాపీగా ఉన్నానని, ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌శాంతంగా ఉండ‌టం, చిన్న చిన్న వాటిని ఆస్వాదించడం ఎలాగో నేర్చుకున్నాను అంటూ ఆశికా రంగనాథ్‌ చెప్పుకొచ్చింది. ఈమె కాకుండా దర్శన్‌ ఇంకా పలువురు సినీ హీరోలు కూడా వాళ్ళ ఫాంహౌస్‌లో సమయం గడుపుతూ పనులు చేసిన విషయం మనకు తెలిసిందే.

తోట పనిలో బిజీగా ఉన్న హీరోయిన్.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts