వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో పెద్ద సంచలనం అయింది అరియానా. ఆ తరువాత తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల అరియానా ఆమె ఫాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరిపింది. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు పెట్టడం లేదన్న ప్రశ్నకు, తనకి ఎలాంటి వీడియోలు చేస్తే అందరికి నచ్చుతాయో అసలు అర్థం కావడం లేదని సమాధానం చెప్పింది.
నటన ఇంకా యాంకరింగ్ లో తనకు ఎక్కువగా యాంకరింగ్ ఇష్ట పడతానని ఆ తర్వాతే యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తానని అరియానా చెప్పుకొచ్చింది. ఇంకా ప్రేమ పెళ్లా లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న ప్రశ్నకు కుండా బద్దలు కొట్టినట్టు లవ్ మ్యారేజే చేసుకుంటానని చెప్పింది అరియనా. ఇంకా తనకి ఏమైనా క్రష్ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు, కొంతమందిని చూస్తే భలే ఉన్నాడే ఈ అబ్బాయి అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.