వామ్మో.. `ఆర్ఆర్ఆర్‌`లో ఆ ఒక్క పాట‌కే నెల రోజులా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంపై ప్ర‌తి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంటుంది. ఇక తాజాగా మ‌రో క్రేజీ వార్త వైర‌ల్‌గా మారింది. ఆర్ఆర్ఆర్‌లో ఇంకా రెండు పాటలను తెరకెక్కించాల్సి ఉంద‌ట‌. అందులో ఓ పాట ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌పై ప్లాన్‌ చేశారట.

అయితే ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌కు ఏకంగా నెల రోజులు ప‌డుతుంద‌ని.. సినిమా ప్రత్యేక ఆకర్షణల్లో ఈ సాంగ్ కూడా ఒక‌టిగా నిలుస్తుందని టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా నెల రోజులంటే.. ఆ సాంగ్‌లో ఎంత ప్ర‌త్యేక‌త ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా, కరోనా ఉధృతి తగ్గిన తర్వాత వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి.. అనుకున్న టైమ్‌కు సినిమాను విడుద‌ల చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్నార‌ట‌.

Share post:

Latest