క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డ‌టంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పుడు మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ఎఫ్ 3 టీమ్ భావిస్తోంద‌ట‌. కరోనా సమయమే అయినప్పటికీ, సెట్లోనే షూటింగ్‌ కావడం వలన మొదలు పెట్టేద్దామని అనుకుంటున్నారట.

ఇందులో భాగంగానే వచ్చే నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్, సారథీ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో వెంకటేష్‌, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో కొన్ని కామెడీ సీన్స్ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. క‌రోనా టైమ్‌లో ఎఫ్ 3 టీమ్ రిస్క్ చేస్తున్న‌ట్టే అవుతుంది.

Share post:

Latest