అప్ప‌టికి షిఫ్ట్ అయిన `అఖండ‌` ఫ‌స్ట్ సింగిల్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.

షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఫ‌స్ట్ సింగిల్ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిన్న(మే 28) స్వ‌ర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సంద‌ర్భంగా.. అఖండి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అది జ‌ర‌గ‌లేదు.

అయితే తాజాగా స‌మాచారం ప్రకారం.. అఖండ ఫ‌స్ట్ సింగ‌ల్ జూన్ 10కి షిఫ్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే, జూన్ 10న బాల‌య్య బ‌ర్త్‌డే. అందుకే ఆ రోజున ఫ‌స్ట్ సింగిల్ వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.