ప‌వ‌న్ హీరోయిన్ ఆవేద‌న‌..2 రోజులుగా న‌ర‌కమంటూ పోస్ట్‌!

క‌రోనా వైర‌స్‌ మ‌ళ్లీ ఎక్క‌డిక‌క్క‌డ కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో బ‌లైపోయారు. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటొంది బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి కర్బందా.

తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. గ‌త రెండు రోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యేవరకూ ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలనుకుప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్‌లో పెడుతున్నారని భావించి వెనకడుగు వేయండి. మీ ప్రాణాలను, జీవితాలను లైట్‌ తీసుకోకండి.. అంటూ అవేద‌న‌తో కూడిన ట్వీట్ చేసింది.

కృతి ట్వీట్ బ‌ట్టీ.. ఆమె కుటుంబ‌స‌భ్యులు క‌రోనా బారిన ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు. కాగా, కృతి తెలుగు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న తీన్‌మార్ సినిమా చేసింది. ఆ త‌ర్వాత ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనే బిజీగా గ‌డుపుతోంది.

Share post:

Popular