కేజీఎఫ్ 2 నుండి ఇనాయత్​ ఖలీల్​ లుక్ రిలీజ్..!

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్ యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్ రూపొందుతుండ‌గా, ఈ సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ ఇందులో న‌టించిన న‌టీన‌టుల బ‌ర్త్‌డేల‌ని పుర‌స్క‌రించుకొని పేపర్​ కట్టింగ్​లతో వారి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తుంది. తాజ‌గా మూవీలో ఇనాయత్​ ఖలీల్​ క్యారెక్టర్​ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్​ను రిలీజ్​ చేసింది నిర్మాణ సంస్థ. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్​ ఖలీల్​ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ క్యాప్షన్​ ఉంచింది. దుబాయ్​లో ఉంటూ ఇండియాపై కన్నేసే గోల్డ్​ స్మగ్లర్ల డాన్​గా ఇనాయత్​ ఖలీల్​ రోల్​ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Share post:

Popular