బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కొద్ది వారాలుగా అమల్లో ఉన్న కర్ఫ్యూ నేటితో(మే 31) ముగియనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రానందున కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జూన్‌ 10 తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సడలింపు సమయం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రస్తుత కేసులు, రికవరీ రేటు తదితర అంశాలపై చర్చించారు.. గతంతో పోల్చుకుంటే కరోనా కంట్రోల్ అయినప్పటికే మరింత కఠినంగా ఉండాల్సిందే అని ఆయన అధికారులకు చెప్పినట్టుు తెలుస్తోంది.