బ్రేకింగ్ : ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్…!

May 31, 2021 at 3:22 pm

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పంపిణీ చేసే వాటిలో కంట్లో వేసే ముందు తప్ప మిగతా మందులను పంపిణీ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీసీఆర్ఏఏస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడకు చెందిన ఆయుష్ విభాగం వైద్యులు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైద్యులు ఆనందయ్య ముందు తీసుకున్న 570 మందితో కొన్ని రోజులగా మాట్లాడుతూ అనేక వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఆర్ఏఏస్ కు నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ప్రకారమే సీసీఆర్ఏఏస్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుపై ఇంకా నివేదిక‌లు రావాల్సి ఉంది. అవి మరో మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్ర‌స్తుతానికి ఆ మందుకు అనుమ‌తి ఇవ్వడానికి ప్రభుత్వం నిరాక‌రించింది. ఆనంద‌య్య మందు వ‌ల్ల ఎలాంటి హాని లేద‌ని నివేదికలు తేల్చాయి. ఆనంద‌య్య‌ మొత్తం 5 ర‌కాల మందులు త‌యారు చేశారు. అందులో కంట్లో వేసే మందుకు తప్ప.. మిగ‌తా 4 మందులు త‌యారు చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు.

బ్రేకింగ్ : ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts