మ‌రోసారి భ‌య‌పెట్టేందుకు రెడీ అయిన కాజ‌ల్‌..స‌క్సెస్ అయ్యేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌..ఈ పేరు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్న కాజ‌ల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవ‌లె లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కాజ‌ల్‌.. మ‌రోసారి భ‌య‌పెట్టేందుకు రెడీ అయింది.

ప్ర‌స్తుతం కాజ‌ల్ తమిళంలో ఓ హారర్‌ సినిమా చేస్తోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్‌, జననీ అయ్యర్‌, ఇరాన్‌ నటి నోయారికా కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉండి వాటిని వినియోగించుకోలేని యువతిగా కాజల్‌ కనిపించగా.. ఆమెను అనుక్షణం వ్యతిరేకించే యువతిగా రెజీనా కనిపిస్తుంద‌ట‌.

ఇక జననీ, రైజా, నోయారికా పాత్రలు ప్రయోగాత్మక పంథాలో ఉంటాయని తెలుస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ మ‌రియు టైటిల్ విడుద‌ల కానుంది. కాగా, లైవ్ టెలికాస్ట్ తో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా కాజ‌ల్‌.. ఈసారైనా స‌క్సెస్ అవుతందో లేదో చూడాలి.