క‌రోనా దెబ్బ‌..ఓటీటీలో రాబోతున్న గోపీచంద్ `సీటీమార్‌`?

యాక్ష‌న్ హీరో గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా క‌నిపించ‌నున్నారు.

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే ఏప్రిల్ 2నే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా దెబ్బ‌కు విడుద‌ల వాయిదా ప‌డింది.

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ఏ సినిమానూ థియేట‌ర్‌లో విడుదల అయ్యే ప‌రిస్థితి లేదు. అందుకే సీటీమార్ చిత్రాన్ని ఓటీటీ విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతేకాదు, ప్రముఖ ఓటీటీ సంస్థ‌ ఈ సినిమాకు మంచి ఆఫర్ ఇచ్చిందట. ఆ ఆఫ‌ర్‌పై సంతృప్తిగా ఉన్న మూవీ మేక‌ర్స్ ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Share post:

Latest