మహేష్ సరసన బాలీవుడ్ భామ…?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ దిశాపటాని నటిస్తుందని ఓ వార్త హల్చల్ చేస్తుంది.

కానీ మహేష్, త్రివిక్రమ్ చిత్రానికి ముందుగా పూజా హెగ్డే డి హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ప్రస్తుతం దిశా పటాని పేరు వినిపిస్తుంది. అసలు త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు కాబట్టి ఈ చిత్రంలో దిశా ఇంకా పూజా హెగ్డే ఇద్దరు నటించే అవకాశం ఉందని, అందుకనే దిశాపటానితో మాటలు జరుపుతున్నారని అంటున్నారు సినీ జనాలు. చూడాలి మరి చివరికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన చిత్రానికి ఎవరిని తీసుకోనున్నారో.

Share post:

Popular