మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మహారాజా రవి తేజతో గానీ బోయపాటి తన తదుపరి చిత్రాన్ని చేయాలని అనుకున్నారు.
అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్రమంలోనే ఇటు అల్లు అర్జున్, అటు రవితేజ ఇద్దరూ సైడ్ అయ్యారు. దీంతో ఇప్పుడు బోయపాటి టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని లైన్లో పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బోయపాటి నెక్ట్స్ సినిమా రామ్‌తోనే అని బలంగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.