నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?

నంద‌మూరి హీరోల‌ నుండి మ‌ల్టీస్టార‌ర్ వస్తే చూడాల‌ని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆస‌క్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి క‌లను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ చిత్రం ప్రేక్షల ముందుకు రానుంది.

ఎఫ్ 3 చిత్రం పూర్తి అయ్యాక దర్శకుడు అనీల్ రావిపూడి బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌ల్టీ స్టార‌ర్ మూవీని ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల టాక్. క‌ల్యాణ్ రామ్ ఎప్ప‌టి నుండో బాబాయ్ బాల‌కృష్ణ‌తో కలిసి ఒక మూవీ అయినా చేయాల‌ని అనుకుంటున్నాడు. ఇప్పుడు తన కోరిక‌ను దర్శకుడు అనీల్ రావిపూడి ద్వారా తీరనుంది.

Share post:

Latest