బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువ‌ట‌..బీ కేర్‌ఫుల్‌!

May 18, 2021 at 8:18 am

క‌రోనా వైర‌స్‌తోనే నానా తిప్ప‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌రో కొత్త భ‌యంగా మారింది. కరోనా రోగుల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగ‌స్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్‌తో కొంద‌రు మృతి చెంద‌గా.. కొంద‌రు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగ‌స్ తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది.

దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవ‌ర్ని ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ పై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా రోగులంద‌రికీ బ్లాక్ ఫంగస్ వ‌స్తుంద‌నుకుంటే పొర‌పాటేన‌ని.. కేవ‌లం ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న రోగుల‌నే ఈ మ‌హ‌మ్మారి ఎటాక్ చేస్తుంద‌ని తెలిపారు.

ముఖ్యంగా డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తుల్లోనే దీని ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. ఒక‌వేళ షుగర్ నియంత్రణలో ఉంటే దీని గురించి అస్స‌లు భయపడనక్కర్లేదని వివరించారు. డ‌యాబెటిస్ రోగుల‌తో పాటు స్టెరాయిడ్స్ అధికంగా వాడే వారిని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిని బ్లాక్ ఫంగ‌స్ ఎటాక్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. సో..ఇలాంటి వారు కాస్త ఎక్కువ‌గా కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిది.

బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువ‌ట‌..బీ కేర్‌ఫుల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts