పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్.
శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఏప్రిల్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతి చోట సూపర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కరోనా భయాలు టిక్కెట్ రేట్ల తగ్గింపు వివాదం వగైరా ఏవీ వసూళ్లను ఆపలేదు.
కేవలం ఆడియన్స్ మౌత్ టాక్ సినిమాకు ప్రధాన బలంగా మారింది. దీంతో ఈ మూవీ చూసేందుకు అందరూ పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ ఐదు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ బిగ్ ఫీట్‌ను అందుకున్నట్టు అయింది.