యోగి ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా..?

 

దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా బాగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తాజాగా క‌రోనా వైర‌స్ బారిన పడ్డారు. ఇటీవలే ఆయన కరోనా టెస్ట్స్ చేయించుకోగా, క‌రోనా ప‌రీక్ష‌లో ఆయ‌నకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్ర‌స్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు స్వయంగా తెలిపారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు త‌న‌లో క‌నిపించ‌డంతో తాను కోవిద్ పరీక్షలు చేయించుకున్నాన‌ని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆదిత్య‌నాథ్ త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా అందరితో పంచుకున్నారు.

 

తాను ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. వ‌ర్చువ‌ల్ రీతిలో ప‌నులు చేస్తున్న‌ట్లు కూడా చెప్పారు. రోజు రోజుకు కరోనా కేసులు బాగా పెరిగుతున్నాయి. అటు ప్రజలకి, సినీ నటి నటులకు ఇంకా రాజకీయ వ్యక్తులకి కూడా కరోనా వేగంగా సోకుతుంది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు కూడా క‌రోనా సోకినట్లు ఇవాళే త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించిన సంగతి మనకు తెలిసిందే.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>शुरुआती लक्षण दिखने पर मैंने कोविड की जांच कराई और मेरी रिपोर्ट पॉजिटिव आई है। <br><br>मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं। सभी कार्य वर्चुअली संपादित कर रहा हूं।</p>&mdash; Yogi Adityanath (@myogiadityanath) <a href=”https://twitter.com/myogiadityanath/status/1382234422179602432?ref_src=twsrc%5Etfw”>April 14, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>