మరోకసారి పవర్ఫుల్ పోలీస్ గా శర్వా.!

టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్. ప్రస్థానం సినిమా మొదలు నిన్న వచ్చిన శ్రీకారం చిత్రం వరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూస్తే చాలు తన రూటే సెపరేట్ అన్నది అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలులెక్క చెయ్యకుండా తన ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ తన మూవీ కెరీర్ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇప్పుడు మరోకసారి పోలీస్ గా కనిపించనున్నాడట. గతంలో రాధ చిత్రంలో పోలీస్ పాత్ర పోషించి ప్రేక్షకుల్ని అలరించాడు.

అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.కానీ ఈ సారి పూర్తిగా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించబోతున్నాడట సర్వా. కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ శర్వాకు బాగా నచ్చటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. పోలీస్ కథల్లో ఇది కొత్తగా ఉంటుందని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి అవుతాయని చెప్పారు.