కోహ్లీ సేన‌కు బిగ్ షాక్..ఐపీఎల్ వీడిన ఇద్దరు కీల‌క‌ ఆటగాళ్లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ త‌గిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్‌ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్‌కు వీడ్కోలు ప‌లికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.

Australians Adam Zampa, Kane Richardson leave the IPL, Pat Cummins donates $50,000 to Indian COVID relief fund - ABC News

ఈ విష‌యాన్ని కోహ్లీ సేన అధికారిక ప్ర‌క‌టించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండరు. వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం` అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది.

ఇక మ‌రోవైపు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఆండ్రూ టై కూడా ఐపీఎల్‌ను వీడాడు. ఆండ్రూ కూడా వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల టోర్నీకి దూరం అవుతున్నారు. ఈ విష‌యాన్ని రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.

Share post:

Latest