కోవిడ్ టైములో ఇట‌లీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో.?

క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కొందరు హీరోల‌కు సంబంధించిన చిత్ర షూటింగ్స్ ఆగిపోయి వాయిదా పడ్డాయి. అక్కినేని హీరో నాగ చైత‌న్య థాంక్యూ చిత్రం మాత్రం వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ బృందం ఇటీవలే ఇట‌లీకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా థ్యాంక్యూ చిత్ర యూనిట్ ఇటలీలో క‌రోనా జాగ్ర‌త్తలు పాటిస్తూ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేష‌న్స్ స్టిల్స్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. థ్యాంక్యూ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ,శిరీష్ ఇంకా హర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ మరియు డైలాగ్స్ కూడా రాస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ అభిమానిగా నాగ చైతన్య క‌నిపించ‌నున్నారు.

Share post:

Latest