నాని త‌ప్పుకోవ‌డంతో..బ‌రిలోకి దిగిన `జాంబి రెడ్డి` హీరో!

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చ‌త్రం ఏప్రిల్ 23న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా నాని మ‌రియు చిత్ర టీమ్ విడుద‌ల తేదీని వాయిదా వేశారు.

Image

అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి హీరో తేజ‌ స‌జ్జా బ‌రిలోకి దిగుతున్నాడు. య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వంలో తేజ స‌జ్జా, ప్రియా ప్రకాష్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసింది. ఇక విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌కు రెడీ అవుతోంది.

Share post:

Latest