టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.

ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేశార‌ని అంటున్నారు. మ‌రోవైపు న‌రేంద్ర అరెస్ట్‌పై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది.

Share post:

Latest