అదిరిన‌‌ `వై’ ట్రైల‌ర్..మ‌రో థ్రిల్లింగ్ మూవీతో వ‌స్తున్న `ఆహా`!‌

గ‌త కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్ష‌కులను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మ‌రో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీల‌క పాత్ర‌లో బాలు అడుసుమిల్లి తెర‌కెక్కించిన చిత్రమే `వై`.

థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సినిమా డైరెక్టర్‌‌కి, రైటర్‌కి మధ్య ఓ సినిమా గురించి జరిగిన సంఘటనలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి అనేది ఈ ట్రైల‌ర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు.

`పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించడానికి ప్రతి వాడూ పూరి జగన్నాథ్‌ కాదు కదా సర్‌` అంటూ రాహుల్‌ రామకృష్ణ చెప్పే డైలాగ్ తెగ ఆక‌ట్టుకుంటుంది. ఇక ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథా, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మెత్తానికి ట్రైల‌ర్ అదిరిపోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.‌

Share post:

Latest