ర‌ష్మిక జోరు..ముచ్చటగా మూడో సినిమాకు గ్రీన్ సిగ్నెల్‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చాలా త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగు, క‌న్న‌డ, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అమ్మ‌డు జోరుకు బ్రేకు వేయ‌లేక‌పోతున్నారు.

ప్ర‌స్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి `మిషన్ మజ్ను` సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక‌. బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఇదే మొద‌టి సినిమా. ఈ చిత్రం సెట్స్ మీద ఉండ‌గానే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బి ముఖ్యపాత్రలో ‘గుడ్ బై’ టైటిల్‌తో తెర‌కెక్క‌బోతోన్న చిత్రంలో ర‌ష్మిక న‌టిస్తోంది. ఇటీవ‌లె ఈ చిత్రం కూడా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది.

అయితే ఈ రెండు చిత్రాలు పూర్తి కాక‌ముందే.. ముచ్చ‌ట‌గా మూడో ప్రాజెక్ట్‌ను గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ర‌ష్మిక‌నే తెలిపింది. సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించింది ర‌ష్మిక‌. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ల గురించి ఓ అభిమాని అడ‌గా..`ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నాను. మూడో ప్రాజెక్ట్ కూడా ఒప్పుకున్నాను. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాను` అని ర‌ష్మిక తెలిపింది.

Share post:

Latest