నారాలోకేష్‌ను వైర‌స్ అంటూ వ‌ర్మ ట్వీట్‌..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వ‌ర్మ‌.. ఆ సారి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైర‌స్‌ పట్టుకుంది.. ఈ వైర‌స్ ప్రాణాంత‌క‌మైన‌ది అని వ్యాఖ్యానించిన వ‌ర్మ‌.. ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉంది.. దాని పేరే ఎన్టీఆర్ అని సూచించాడు.

టీడీపీ కార్యకర్తలకు తన సలహా విని త్వరపడి. తెలుగు దేశం పార్టీకి టీకా వేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. లేదా మీరందరూ ఆ వైరస్ బారిన పడి చచ్చిపోతారని వ‌ర్మ పేర్కొన్నారు. అయితే వ‌ర్మ చేసిన ఈ ట్వీట్‌తో టీడీపీ నాయ‌కుల‌ను ఆగ్ర‌హానికి గురైనా.. ఎన్టీఆర్ అభిమానుల‌ను మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share post:

Latest