ఆ మెగా హీరోపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న ర‌కుల్‌?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కెరటం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంతోన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది.

కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావ‌డం, వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో ర‌కుల్‌కు అవ‌కాశాలు కూడా త‌గ్గుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ర‌కుల్‌. కానీ, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఇప్పుడు ర‌కుల్ ఆశ‌ల‌న్నీ మెగా హీరోపైనే పెట్టుకుంది.

ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న‌ మెగా మేన‌ల్లుడు త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌కుల్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇర రకుల్ హోప్స్ అన్నీ ఈ సినిమా మీదే అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే ర‌కుల్ మ‌ళ్లీ సక్సస్ ట్రాక్ ఎక్కిన‌ట్టు అవుతుంది.

Share post:

Popular