కోలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ నేటి ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వివేక్.. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఈ క్రమంలోనే వివేక్ హఠాన్మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని.. ఎంతో బాధ కలుగుతోందని రజనీ చెప్పారు.
శివాజీ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి రోజు ఆయనతో సమయాన్ని గడిపానని.. తన జీవితంలో ఆ రోజులను మర్చిపోలేనని చెప్పారు. వివేక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను..వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నా అని రజనీ పేర్కొన్నారు.