అంజ‌లిని వ‌ద‌ల‌ని నిర్మాత‌..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయినా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు న‌టించినా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌క‌పోవ‌డంతో.. ఇక్క‌డ ఆమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది.

అలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమా అంజ‌లికి అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంజ‌లికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. కానీ, ఉన్న‌ట్టు ఉండి మ‌ళ్లీ అంజ‌లి గ్రాఫ్ ప‌డిపోయింది. ఇక ఇప్పుడు కూడా దిల్ రాజే అందుకున్నాడు.

ఆయ‌న నిర్మించిన `వ‌కీల్ సాబ్‌` చిత్రంలో అంజలికి ఆఫ‌ర్ ఇవ్వ‌గా.. ఈ చిత్రంలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించి మ‌ళ్లీ ఒక్క‌సారిగా పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ వరుసగా చాన్స్ లు వస్తాయో రావో అన్నది ప‌క్క‌న పెడితే దిల్ రాజే ముచ్చటగా మూడో చాన్స్ కూడా ఇచ్చార‌ట‌. ఆయ‌న నిర్మాణంతో అనిల్ రావిపూవి ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ-వ‌రుణ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న `ఎఫ్ 3` మూడో హీరోయిన్ ఉంటుందట‌. ఆ హీరోయిన్‌గా అంజ‌లిని ఫిక్స్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ షూటింగ్‌లో కూడా జాయిన్ అవ్వ‌నుంద‌ని అంటున్నారు.

Share post:

Latest