అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన దిల్‌రాజు!‌

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. గ‌తంలో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` అనే సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌బోతున్న‌ట్టు కూడా అప్ప‌ట్లో వెల్ల‌డించారు.

ప్ర‌క‌ట‌న వ‌చ్చింది గాని.. ఈ సినిమా సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌కు త‌గ్గ‌ట్టే.. బ‌న్నీ పుష్ప మొద‌లు పెట్టారు. వేణు శ్రీ‌రామ్ ప‌వ‌న్‌తో వ‌కీల్ సాబ్ తెర‌కెక్కించి హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఐకాన్ తెర‌పైకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా స్టార్ట్ కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక ఈ వార్త‌ల‌ను నిజంగా చేస్తూ దిల్ రాజు తాజాగా బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో గతంలో ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని త్వరలో తెరకెక్కించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది. మా బ్యానర్‌లో నెక్ట్స్ మూవీ ‘ఐకాన్’. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది అని వెల్ల‌డించారు.

Share post:

Latest