పూజా హెగ్డే జోరు..న‌య‌న‌తార త‌ర్వాత ఆ రికార్డు బుట్ట‌బొమ్మ‌దే!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ బుట్ట‌బొమ్మ‌కు అందం, అభిన‌యంతో పాటు ల‌క్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆఫ‌ర్లు వెల్లువెత్త‌డం.. వ‌రుస హిట్లు ప‌డ‌టంతో టాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.

ఇక చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా టాలీవుడ్‌, బాలీవుడ్ మ‌రియు కోలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో దూసుకుపోతోంది. ఇటీవ‌లె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి 65వ చిత్రంలో ఛాన్స్ కూడా ద‌క్కించుకుంది. అయితే కోలీవుడ్‌లో ఇది రెండో చిత్రమే అయిన‌ప్ప‌టికీ.. పూజా రెమ్యున‌రేష‌న్ మాత్రం భారీగానే పుచ్చుకుంటుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి పూజా ఏకంగా రూ. 3 కోట్లు తీసుకుంటుంద‌ట‌. ఆమె క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు కూడా అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పార‌ట‌. ఏదేమైనా కోలీవుడ్లో నయనతార తరువాత ఈ స్థాయి రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న రికార్డు పూజాదే అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest