పీపుల్ మీడియాతో భాగస్వామ్యం కానున్న ప‌వ‌న్‌..!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ పీకేసీడ‌బ్ల్యూ, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌‌రీ ఎల్ఎల్‌పీతో తాజాగా భాగ‌స్వామ్యం అయింది. వివిధ భాష‌ల్లో మూవీ , స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించాలానే మంచి ఉద్దేశంతో పీకేసీడ‌బ్ల్యూను మొదలు పెట్టారు ప‌వ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ 10+ ఫీచ‌ర్ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్‌తో చిత్రాలని నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్ర‌సాద్ పీపుల్ మీడియాను స్థాపించారు.

ఇపుడు ప‌వ‌న్‌, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఇద్ద‌రూ క‌లిసి యువ టాలెంట్‌ను ప్రోత్సహించాల‌ని అనుకుంటున్నారు. మూవీ ఇండ‌స్ట్రీలోకి రావాల‌నుకునే వారికి మూవీ మేకింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో సరి కొత్త ఐడియాల‌తో వ‌చ్చే వారికి దీనిలో అవకాశం ఇవ్వ‌నున్నారు. హ‌రీశ్ పై క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్గా ఇందులో ప‌ని చేయ‌నున్నారు. ఓ వైపు సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉండే ప‌వ‌న్‌..రాబోయే కాలంలో కొత్త న‌టీనటుల‌ను ప్రోత్స‌హించేందుకు కొత్త ప్లాట్‌ఫాం క్రియేట్ చేయ‌డం ఎంతో ప్ర‌శంసించ‌ద‌గిని విష‌య‌మ‌నే చెప్పచు.

Share post:

Latest