కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్‌..ఇక ఫ్యాన్స్‌కు పూన‌కాలే?

ఈ మ‌ధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్ష‌కులు కూడా డబుల్‌ డోస్‌ మజాని ఇచ్చే మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు.

ప్ర‌స్తుతం తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్స్ లో ఇది ఒకటి. అయితే త్వ‌ర‌లోనే మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేయ‌బోతున్నాడ‌ట ఎన్టీఆర్‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం..కోలీవుడ్ స్టార్ హీరో ద‌లపతి విజయ్‌తో ఎన్టీఆర్ ఓ మ‌ల్టీస్టారర్ చేయ‌నున్న‌డ‌ట‌. ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్‌ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. అటు విజ‌య్‌, ఇటు ఎన్టీఆర్ అభిమానుల‌కు పూన‌కాలే అని అంటున్నారు.‌