పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్ల సూపర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ముదులిపేసింది.
ఇదిలా ఉండే.. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం థియేటర్లోనే ప్రేక్షకులతో కలిసి వకీల్ సాబ్‌ను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే నివేధా థామస్ కూడా థియేటర్‌కు వచ్చి సినిమా చూసింది. అయితే నివేధా అందరితో కూర్చుని కాకుండా.. చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి.. ఎవరినీ తాకకుండా లాస్ట్‌లో నిల్చోని సినిమాను చూసింది.
అయితే ఇప్పుడు ఇదే నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. వకీల్ సాబ్ విడుదలకు ఆరు రోజుల ముందు నివేధా కరోనా బారిన పడింది. అందుకే ఈ చిత్రం ప్రమోషన్స్‌కు కూడా హాజరు కాలేదు. మరి ఇప్పుడు థియేటర్లో కనిపించడంతో.. అడియన్స్ కాస్త భయానికి గురయ్యారు. ఇంత త్వరగా కరోనా నుంచి కోలుకుందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె కరోనా నుంచి కోలుకుందో లేదో తెలియాల్సి ఉంది.
I live for these moments…
Maatalu levu ♥️#VakeelSaab pic.twitter.com/vFWzdWJYHI— Nivetha Thomas (@i_nivethathomas) April 10, 2021