అల‌ర్డ్ అంటున్న‌ `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచ‌న‌లో ప‌డ్డ ఫ్యాన్స్‌!‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)‌`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేయ‌గా.. చిత్ర యూనిట్ ఏదో ఒక అప్డేట్‌తో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేస్తోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఏదో అలెర్ట్ అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ పోస్ట్ చేసారు. చరణ్ మరియు తారక్ లు చేస్తున్న రోల్స్ ను ప్రెజెంట్ చేస్తూనే.. ప్రస్తుత వేసవికి రిలేటెడ్ గా క్యాప్ష‌న్స్ పెట్టారు. దీంతో మెగా మ‌రియు నంద‌మూరి అభిమానులు స‌మ్మ‌ర్ కానుక‌గా ఆర్ఆర్ఆర్ నుంచి ఏదైనా అప్డేట్ వ‌స్తుందా.. అన్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

Share post:

Latest