`రాధేశ్యామ్‌` నుంచి ఉగాది ట్రీట్ అదిరిపోయిందిగా..ఖుషీలో ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రమిది.

ఇదిలా ఉండే.. ఉగాది పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు రాధేశ్యామ్ యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసంది. రాధే శ్యామ్ నుంచి చాలా పండగలు.. ఒకటే ప్రేమ అంటూ ప్రభాస్ చిరునవ్వుతో ఉన్న ఈ పోస్టర్ ప్ర‌స్తుతం తెగ ఆక‌ట్టుకుంది.

Image

ఈ పోస్ట‌ర్ చూసిన ప్ర‌భాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share post:

Popular