సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు..!

గ‌త ఏడాది క‌రోనా కారణంగా అన్ని రాష్ట్రాలు ఇంకా ప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్ర‌భుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తింటుంద‌ని, ఎవ‌రికి వారు స్వీయ లాక్‌డౌన్ చేసుకోవాల‌ని చెప్తున్నారు. తాజాగా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయన తన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

ప్ర‌భుత్వం లాక్‌డౌన్ పెడుతుందో లేదో కాని నేను మాత్రం వ‌చ్చే రెండు వారాలు సెల్ఫ్ లాక్‌డౌన్ పెట్టుకుంటున్నాను. బ‌య‌ట‌ప‌రిస్థితులు చూస్తే ఇది ఎంత అవసరమో అర్ధ‌మ‌వుతుంది. చాలా మంది ఎంతలా క‌ష్ట‌ప‌డుతున్నారో, ఇక‌ నుండైనా వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ చేయించుకుని వైద్యుల‌కు కాస్త విశ్రాంతి ఇద్ధాం అంటూ నాగ్ అశ్విన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Whether the government declares it or not…next 2 weeks should be a personal lockdown…For those of you who say lockdown is not the answer, pls go see the hospitals and how overworked they have been the past month..While we mass vaccinate, we must give the doctors some relief</p>&mdash; Nag Ashwin (@nagashwin7) <a href=”https://twitter.com/nagashwin7/status/1387647849790246912?ref_src=twsrc%5Etfw”>April 29, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>