మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప‌` టీమ్‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్‌ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఇప్ప‌టికే చిత్రం యూనిట్ పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ టీజ‌ర్ అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లను సైతం తెగ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పటికే ఆరు లక్షలు లైక్స్ క్రాస్ అయ్యిపోయిన ఈ టీజర్.. 12 మిలియన్ వ్యూస్‌ను రాబ‌ట్టి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇలాంటి త‌రుణంలో మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చారు పుష్ప నిర్మాత‌లు.

ఈ చిత్రం నుంచి అప్డేట్స్ అప్పుడే అయ్యిపోలేదు మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నాయి తగ్గేదే లే అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. దీంతో పుష్ప నుంచి ఇంకేం అప్డేట్స్ వ‌స్తాయో అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు.

Share post:

Latest