కాబోయే వాడితో ర‌చ్చ చేస్తున్న మెహ్రీన్‌..ఫొటో వైర‌ల్‌!

మెహ్రీన్ కౌర్.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఇటీవ‌లె రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది.

ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనుంది మెహ్రీన్‌. అంతేకాదు, ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదిక‌గా వివాహం చేసుకోనున్న మెహ్రీన్‌.. ఆ త‌ర్వాత హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం కూడా పెళ్లి చేసుకోనుంద‌ట‌.

ఇదిలా ఉంటే.. ఎంగేజ్మెంట్ త‌ర్వాత నుంచి కాబోయే భ‌ర్త భవ్య బిష్నోయి‌తో వ‌రుస ఫొటో షూట్లు చేస్తూ ర‌చ్చ చేస్తోంది మెహ్రీన్‌. తాజాగా కూడా అదే చేసింది. భ‌వ్య‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటో ఒక‌టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఆ ఫొటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.‌

 Mehreen Pirzada : కాబోయే వాడితో నటి మెహ్రీన్.. Photo : Instagram

Share post:

Popular